- కేసిఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకొని ప్రజలపై అప్పు వేసింది
- మాదాపూర్ డివిజన్ ప్రచారంలో సిపిఐ నారాయణ
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ డాక్టర్స్ కాలనీ కావేరి హిల్స్లో సిపిఐ పార్టీ నారాయణతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న సిపిఐ నారాయణ మాట్లాడుతూ పదేళ్ల అవినీతి పాలనను.. పదేళ్ల అహంకార పాలనను తరిమికొట్టాలని, తెలంగాణ రాష్ట్ర కోట్లాదిమంది ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పేరుతో లక్షల ఎకరాల భూమిని దోచుకున్నారని, కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత, బందుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రజలపై భారం వేశారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని, వామపక్షాల పార్టీలుగా కాంగ్రెెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు తాము మద్దతుు తెలుపుతున్నామని, మాదాపూర్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్ గా 2 సార్లు గెలిపించారు అదే మాదిరిగా ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎంబీఏ, ఎల్ఎల్ బి హైకోర్టు లాయర్ గా అనుభవం ఉన్న వ్యక్తిగా.. ఉన్నతమైన చదువులు చదివిన జగదీశ్వర్ గౌడ్ ను గెలిపిస్తారా.. 9వ తరగతి చదివిన గాంధీ నియోజకవర్గానికి అవసరమా అన్న విషయం నియోజకవర్గ ప్రజలు మాదాపూర్ వాసులు ఆలోచించాలని నారాయణ అన్నారు.
- మాదాపూర్ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా : అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
రెండుసార్లు కార్పొరేటర్ గా ఆశీర్వదించారు. మీ ఇంటి బిడ్డగా ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో అందుబాటులో ఉన్నా. డివిజన్లో డ్రైనేజీతో పాటు రోడ్లు వీధిలైట్లు, ఇలా ప్రతి పని చేశానని, మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించండి. గెలిచిన తర్వాత మాదాపూర్, చందా నాయక్ తండ , అయ్యప్ప సొసైటీ, గూగుల్ ట్రస్ట్ భూముల సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తా. ఢిల్లీ సుప్రీంకోర్టు లో కేసులను కొట్టి వేసే విధంగా న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతా. 30వ తారీఖున హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించండి.