ఏకాగ్రత, మానసికోల్లానికి క్రీడలు దోహదం

  • హకీ ట్రిపుల్ ఒలింపియాన్ అర్జున అవార్డు గ్రహిత, పద్మశ్రీ నందనూరి ముఖేష్ కుమార్
  • త్రివేణి పాఠశాలలో ఘనంగా వార్షిక క్రీడా సంబురాలు ముగింపు ఉత్సవం
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • విద్యార్థులకు బహుమతులు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: స్థానిక మదీనాగూడలోని త్రివేణి పాఠశాలలో మంగళవారం వార్షిక క్రీడా సంబురాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హకీ ట్రిపుల్ ఒలింపియాన్ అర్జున అవార్డు గ్రహిత, పద్మశ్రీ నందనూరి ముఖేష్ కుమార్, త్రివేణి, కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ జగదీష్, రంగారెడ్డి జిల్లా హాకీ ఫెడరేషన్ సెక్రటరి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్కూల్ యజమాన్యం చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అభినందించారు.

క్రీడాకారులకు కరచాలనం

ఆటల పోటీలలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెమెంటోస్ తో అభినందించారు. ఏకాగ్రత, మానసిక, శారీరక దృఢత్వానికి ఆటలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సిఎ సి డా. నటరాజ్, సి ఆర్ ఓ సాయి నరసింహారావు, సి.ఎ.ఓ చంచారావు, సెంట్రల్ ॥T కీ ఆర్డినేటర్ చక్రి, సి.ఎస్. ఓ సుబ్బారావు, పాఠశాల ప్రిన్సిపల్స్ జగదీష్, అర్చన, అవిత మాళిని, వైస్ ప్రిన్సిపల్స్ హిమబిందు, ఆఫ్రికా, ఉపాధ్యాయ, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here