ఉచిత నీరు అని చెప్పి వేల రూపాయల బిల్లులు వేస్తున్నారు

  • బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ దృష్టికి తెచ్చిన ప్రేమ్ నగర్ బి బ్లాక్ బస్తీ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో బస్తీ వాసుల పిలుపుమేరకు బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఉచిత నీరు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి ఇప్పుడు వేల రూపాయల వాటర్ బిల్లులు వేశారని స్థానికులు ఆయన దృష్టికితీసుకొచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉచిత మంచినీరు ఇస్తామని మీటర్లు బిగించి.. ఇప్పుడు వేలాది రూపాయల బిల్లులు వేయడం , బిల్లులు కట్టిన పక్షంలో వాటర్ కనెక్షన్లు కట్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నా మానసపుత్రికలని, అందరికీ మంజీరా నీరు ఉచితంగా ఇవ్వడం నా లక్ష్యం అని చెప్పుకునే కెసిఆర్ పేద వారికి వేల రూపాయల వాటర్ బిల్లులు ఎంతవరకు సమంజసం అని అన్నారు. స్థానికుల సమక్షంలో వాటర్ బోర్డ్ మేనేజర్ తో మాట్లాడి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వారు కూడా పరిశీలించి బిల్లులు కట్టకుండా చూస్తామని, వాటర్ కనెక్షన్లు కట్ చేయమని హామీ ఇచ్చారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేసే దిశగా అధికారులతో మాట్లాడి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో చంద్రశేఖర్ యాదవ్, గోపాల కృష్ణ, రాజు, రెహ్మతుల్ల పాల్గొన్నారు.

ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో పర్యటించి సమస్య తీరులు తెలుసుకుంటున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ కు.. అనంతరం వినతి అందజేస్తున్న బస్తీవాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here