సీసీ రోడ్డు పనులు సత్వరమే పూర్తి చేయండి

  • సిసి రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోని బాపునగర్, ప్రశాంతినగర్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు ఆయన దృష్టికి వాటర్, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని.. సీసీ రోడ్డు పనులను పూర్తి చేసేలా చూడాలని తెచ్చారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు, ప్రాధాన్యత క్రమంలో కాలనీలవారిగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన సీసీ రోడ్డు పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏరియా మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసి వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్, ఎలక్ట్రికల్ లైన్ మెన్ బ్రహ్మం, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, యాదయ్య ముదిరాజ్, దాసోజ్ శ్రీనివాస్, అశోక్ చారీ, వెంకటేశ్వర రెడ్డి, హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఎం.డి.గాఫర్, బ్రహ్మచారి, సందయ్యనగర్ బస్తీ అధ్యక్షులు బసవరాజ్ లింగయత్, ముంతాజ్ బేగం, దీవెన, రియాజ్, అహ్మద్ ఖాన్, జోషీ, రమేష్, పటేల్, అల్తామేష్, మహేష్ చారీ, కిట్టు ముదిరాజ్, శ్రవణ్, మహేష్ రాపన్, మహేందర్ సింగ్, మహేష్ యాదవ్, శ్రీకాంత్, తుకారం, కాలనీ వాసులు పాల్గొన్నారు.

స్థానికులు టిఆర్ఎస్ నాయకులతో కలిసి నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here