నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో వీధి వీధి తిరిగి పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో భాగంగా స్థానికంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. స్థానికంగా మిగిలి ఉన్న పలు సమస్యలను ప్రజలు, స్థానిక నాయకులు ద్వారా తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. బస్తీలో విద్యుత్ తీగలు సమస్యలు గుర్తించి, సంబంధిత ఎలక్ట్రికల్ అధికారితో మాట్లాడి, విద్యుత్ తీగలను క్రమబద్ధికరించాలని, విద్యుత్ స్థంబాలను అవసరం ఉన్న చోట్ల వేయాలని కోరారు. స్థానికంగా ఉన్న అంగన్ వాడి కేంద్రానికి వెళ్లి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. స్థానిక ఎల్లమ్మ గుడికి వెళ్లి కావాల్సిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకొని త్వరగా అభివృద్ధి పనులను చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని ప్రతి వీధి వీధి తిరిగి ప్రజల కష్టాసుఖాలను తెలుసుకొని, పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా షేక్ ఆదిల్ పటేల్ మాట్లాడుతూ.. కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
కొన్ని కోట్ల రూపాయలు వ్యయంతో సీసీ రోడ్లు, కరెంటు, వీధి దీపాలు, భూ గర్భ డ్రైనేజీ పనులను శరవేగంగా చేయిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా తాగునీటి, డ్రైనేజీ సమస్యలు గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని అన్నారు. ప్రణాళిక బద్దంగా మంజీరా తాగునీటి లైన్లు , డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచి వెంటనే సీసీ రోడ్లను వేయించటం జరుగుతున్నదని అన్నారు. కాలనీల్లో, బస్తీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వాటర్ వర్క్స్ మేనేజర్ విక్రమ్ రెడ్డి, వర్క్ ఇన్ స్పెక్టర్ రహీం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఉస్మాన్, తెప్ప బాలరాజు, జలీల్ అహ్మద్, సంపతీ ప్రభాకర్, మంగలి కృష్ణ, మల్లేష్, సంజు, వెంకటేష్, నరసింహులు, లక్ష్మయ్య, అంజాద్, అహ్మద్, అమీర్, జహంగీర్, ఇస్మాయిల్, వాహిద్ అలీ, సంజు, సమీనా, అంగన్ వాడి టీచర్ సూర్యకాంతం, మొయినుద్దీన్ పాల్గొన్నారు.