నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు ప్రభుత్వ విప్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణలో భాగంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి మాట్లాడారు.

ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామరం వెళ్లే రోడ్డు వయా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని , ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగినదని తెలిపారు. దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై కార్పొరేటర్ తో కలిసి ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర గా స్వయంగా నడుచుకుంటూ వెళ్ళమని తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ విప్ గాంధీ అదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశినాథ్ యాదవ్, పాండు గౌడ్, పోశెట్టి గౌడ్, కిషన్, కైసర్ పాల్గొన్నారు.