నమస్తే శేరిలింగంపల్లి: డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో పంచె కట్టుదోష టిఫిన్ సెంటర్ ను ప్రభుత్వ విప్ గాంధీ ప్రారంభించారు. శుచి, శుభ్రత, నాణ్యత పాటిస్తూ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని, వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు నడుచుకోవాలని తెలిపారు.
యువత తమ మనసుకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని వాటిలో ప్రావీణ్యం సాధించి స్వయం కృషితో ఎదగాలని, మంచి భవిష్యత్ ను నిర్మించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , ఆదిల్ పటేల్, నరేష్ నిర్వాహకులు నాగ భరణం పాల్గొన్నారు.