నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2కి చెందిన సత్యనారాయణ ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2లక్ష 65 వేల నిధులు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం పేదలకు సేవలు అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా నిలుస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాంద్ పాషా, కేఆర్ కె రాజు, శ్రీహరి, సతీష్, సత్యం, వరలక్ష్మి పాల్గొన్నారు.