ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట సీఎం ఘనతే

  • మహబూబ్ నగర్ లో కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్
  • ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన టిఆర్ఎస్ బృందం
ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన టిఆర్ఎస్ బృందం

నమస్తే శేరిలింగంపల్లి: మహబూబ్ నగర్ లో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపుడి గాంధీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగారావు, తెరాస పార్టీ శ్రేణులతో కలిసి పాలమకుల వద్ద మంత్రి మల్లారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఘన స్వాగతం పలికి బహిరంగ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులతో కలిసి కార్లలో భారీ ర్యాలీగా బయలుదేరామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఎంతో ముందుచూపుతో పరిపాలన వికేంద్రీకరణతో సంక్షేమ ఫలాలు ప్రజలకు వేగంగా అందుతాయని భావించి, ప్రజల సౌకర్యార్థం 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే సముదాయం లోకి తీసుకు వచ్చిన ఘనత
సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కాంప్లెక్స్ లో ఒకే చోట అన్ని కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలకు సౌఖ్యంగా.. సమయం ఆదా అవుతుందని , పరిపాలన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్తున్న గొప్ప పరిపాలన దక్షకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, ఆయా డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, సమ్మారెడ్డి, మారబోయిన రాజు యాదవ్, గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు ఉరిటీ వెంకట్రావు, దామోదర్ రెడ్డి, గంగాధర్, దొడ్ల రామకృష్ణ గౌడ్, పోతుల రాజేందర్, సత్యనారాయణ, సురేందర్, అక్బర్ ఖాన్, అంజద్, మోజేశ్, రాము , అశోక్, లింగం శ్రీనివాస్, స్వామి నాయక్, లకపతి, తిరుపతి, కాజా, శివ, ఫక్రుద్దిన్, తెరాస నాయకులు , కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, తెరాస పార్టీ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు టిఆర్ఎస్ బృందంతో కలిసి వెళ్తున్న అరికెపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here