- శిలాఫలకం పెట్టి రెండేండ్లు దాటినా సీసీ రోడ్లు వేయని వైనం
- నీటితో శిలాఫలకాల శుద్ధి..
- ప్రజాప్రతినిధుల తీరుపై బిజెపి నాయకుల నిరసన
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజాప్రతినిధుల పనితీరు.. పనులు వద్దు, శిలాఫలకాల ఏర్పాటే ముద్దు అన్నట్లుగా ఉందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీ, బస్తి, వేమన వీకర్ సెక్షన్, కైలాష్ నగర్ వీకర్ సెక్షన్, పద్మజ కాలనీలలో సీసీ రోడ్లు వేయటానికి రూ. 90 లక్షల నిధులతో శిలాపలకం పెట్టి రెండెండ్ల రెండు నెలలు పూర్తవుతున్న పనులు చేయలేదన్నారు. తిరిగి ఆరు నెలల క్రితం అదే పనికి కైలాష్ నగర్ వీకర్ సెక్షన్ లో 2వ శిలపలకం పెట్టారని.. ఆరు నెలలైనా పని పూర్తి చేయలేదని, తిరిగి మూడు నెలల క్రితం పద్మజ కాలనీ లో సీసీ రోడ్ కోసం మూడో శిలాఫలకం పెట్టి పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒకే పనికి రెండు, మూడు శిలాపలకాలు మారుస్తూ బస్తి వాసులను మభ్యపెడుతూ ప్రజాప్రతినిధులు మోసం చేస్తున్నారని తెలిపారు. 26 నెలల క్రితం శిలాపలకం పెట్టి పనులు చేయకుండా వదిలివేసిన కారణంగా బీజేపీ నాయకులతో కలిసి ఆ శిలాపలకాన్ని నీటితో శుద్ధి చేసి నిరసన వ్యక్తం చేశారు. శిలాఫలకంలో పెట్టిన ప్రతి పనిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారు నెలకొల్పిన శిలాఫలకాలను నీటితో శుద్ధి చేసి, నిరసన వ్యక్తం చేసి ప్రజలకు తెలియజేస్తమని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో రాఘవేందర్ రావు, బొబ్బ నవత రెడ్డి, చందర్ రావు, పోచయ్య, లింగం ముదిరాజ్, అనంత రెడ్డి, శోభ, రాధిక, రమణ కుమారి, రామా రావు, శ్రీకాంత్ యాదవ్, జగదీష్, జనార్దన్ మూర్తి, విజయ్ గౌడ్, గోపి, మోహన్ రావు, వెంకటేశ్వర రావు మొదలగు బస్తి వాసులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.