పరిపూర్ణ ఆరోగ్యానికి 2కే , 5కే రన్

  • ఘనంగా మియాపూర్ మాతృశ్రీ నగర్ లో జాతీయ బాలల దినోత్సవం
  • జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన మియాపూర్ SI యాదగిరి, Landmark హాస్పిటల్ వైద్యులు సుధీర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ మాతృశ్రీ నగర్ లో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ నగర్ కాలనీ వాసులు 2కే , 5కే రన్ నిర్వహించారు. సుమారు వెయ్యి మంది బాలబాలికలు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ బాల్యం.. భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన వరంమని, నేటి బాలలే రేపటి భావి పౌరులని అన్నారు. విద్యారంగంతో పాటు ఆరోగ్య రంగంలోనూ రానించేందుకు 2 కే , 5కే ఫ్యామిలీ రన్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మియాపూర్ SI యాదగిరి, Landmark హాస్పిటల్ Dr సుధీర్ రెడ్డి, Dr చంద్ర శేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కాలనీ వాసులు వెంకట రెడ్డి, నారాయణ రావు, అజయ్ వేదం, CH రామయ్య, కాజా శ్రీనివాసరావు, K అమరనాధ్, V అప్పారావు, రామకృష్ణం రాజు, నాగేంద్ర, రంగా, సుదర్శన్ రెడ్డి, అట్లూరి సతీష్, కేశవ రెడ్డి, D మహేష్ ఆధ్వర్యంలో 2 కే , 5కే రన్ ను నిర్వహించారు.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మియాపూర్ SI యాదగిరి, Landmark హాస్పిటల్ వైద్యులు సుధీర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి
మియాపూర్ మాతృశ్రీ నగర్ నుంచి 2కే , 5కే రన్ లో పాల్గొన్న బాల, బాలికలు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here