నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని గాలయ్య గౌడ్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 60 వేలు మంజూరయ్యాయి.
ఈ ఆర్థిక సహాయానికి చెక్కు ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అన్నారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, పాల్గొన్నారు.