నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హఫీజ్ పేట్ 109 డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. కొంత కాలంగా వర్షాల వల్ల అంబేద్కర్ నగర్ శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున చెత్త, గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా తయారైంది. ఈ విషయమై స్థానికులు బాలింగ్ గౌతమ్ గౌడ్ దృష్టికి తీసుకు వెళ్ళగా.. ఆయన వెంటనే తమ సొంత ఖర్చులతో సమస్యను పరిష్కరించారు.
గత రెండు రోజులుగా అక్కడి ప్రాంతాన్ని జేసిపి సహాయంతో పరిశుభ్రం చేయించారు. ప్రజలు తమ సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.