నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలోని ధ్యాన మారుతి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది బోనాల ఉత్సవాలు సందర్భంగా శేరిలింగంపల్లి నియజకవర్గ పరిధిలోని అమ్మవారి ఆలయల కమిటీలకు దేవాలయ ఖర్చుల నిమిత్తం చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కార్పొరేటర్ శ్రీకాంత్, మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా పండుగలను నిర్వహించుకోవాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకొనేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. దశాబ్ది బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కంటే ఎక్కువ ఫండ్ ను అందించడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఈవో అరుణ కుమారి, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మోహన్ ముదిరాజు, మహేందర్ ముదిరాజు, చంద్రిక ప్రసాద్, సుప్రజ, కల్పన, సోమేశ్వర్ రెడ్డి, కిషోర్, రామచంద్రన్, నరసింహ రాజు, ఫ్రాన్సిస్, స్వామి నాయక్, వెంకటేష్, నరేష్, ముజిబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.