నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి రేపటి ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారికి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలకు విశేష స్పందన వస్తున్నదని తెలిపారు.
రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని చెప్పారు.