గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ అవగాహన కార్యక్రమం

శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిజాంపేట్‌లోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రక్రియపై అర్హులకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ ముఖ్య నాయకులతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు పార్ నంది శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే ముజాహిద్, దొంతి చిన్న ముదిరాజ్, మల్లేష్, అప్సర్, ఉపేంద్ర, ప్రతాప్ రజక, కృష్ణ సూర్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here