వేడుకగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి 

  • వేడుకల్లో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ లో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నానక్‌రామ్‌గూడ లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గంగాధర్ రెడ్డి

ఈ సందర్భంగా మాట్లాడుతూ చత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం 390కి పైగా శత్రు రాజ్యాల రాజులతో యుద్ధాలు చేసి గెలుపు తప్ప ఓటమి ఎరుగని వీరుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. నేడు హిందుత్వ ధర్మం నిలకడగా ఉందంటే చత్రపతి శివాజీ అని అన్నారు. ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. యువత వారు నిర్ణయించుకున్న గమ్యం సాధించడంలో శివాజీని స్ఫూర్తిగా తీసుకోవలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు విట్టల్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, యాదగిరి దేవేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, ఉమేష్, బాబులు సింగ్, కవిత, అరవింద్ సింగ్, రంగస్వామి ముదిరాజ్, శంకర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here