రాజ తంత్రం నేర్పిన ధీరుడు శివాజీ మహారాజ్

  • వైభవంగా చత్రపతి శివాజీ జయంతి
  • ప్రేమ్ నగర్ , హఫీజ్ పేట్ కాలనీలలో చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ర్యాలిని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ను జెండా ఊపి ప్రారంభిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. మియాపూర్ న్యూ కాలనీలోని శివాలయం నుంచి లింగంపల్లి లోని తుల్జా భవాని ఆలయం వరకు నిర్వహించిన ఈ యాత్రలో అతిరథ, మహారధులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సారి కూడా ప్రేమ్ నగర్ హనుమాన్ ఆలయం నుంచి , హఫీజ్ పేట్ గ్రామం, మియాపూర్ శివాలయం నుంచి లింగంపల్లి తుల్జా భవాని ఆలయం వరకు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జై శివాజీ, జై భవాని నామస్మరణతో బైక్ ర్యాలీ శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన వీర శివాజీలందరికీ రవి కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. తల్లి జిజియా భాయి తర్ఫీదునిచ్చిన తీర్చిదిద్దిన వీరుడు, దేశానికి ధర్మానికి హాని జరిగినప్పుడు శత్రువులు దాడి జరిపినప్పుడు రాజ తంత్రం నేర్పిన ధీరుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ను జెండా ఊపి ప్రారంభిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

భవిష్యత్ బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో తలెత్తుకు తిరగాలంటే మన చేతిలో కాషాయం జెండా ఉండాల్సిందేనని మనకు రక్షణ శివాజీ ఎత్తిన కాషాయమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here