నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలువురికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ నుంచి రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరి పత్రాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.
1.మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ కి చెందిన రాజేష్ కుమార్ కి రూ. 1లక్ష, కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కి చెందిన హుస్సేనమ్మకి రూ. 1లక్ష మంజూరైనట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహ్మద్ కాజా పాల్గొన్నారు.