వెనుకబడిన వర్గాలకు ఆశాజ్యోతి డా.బి.ఆర్ అంబేద్కర్ : కార్పొరేటర్ హమీద్ పటేల్

బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి డా. బీఆర్ అంబేద్కర్ అని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ మసీదు వద్ద, డా. బీఆర్ అంబేద్కర్ కూడలిలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక నాయకులతో కలిసి కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్, యువ జన నాయకులు ఆదిల్ పటేల్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

డా. బీఆర్ అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్, ఆదిల్ పటేల్

ఈ సందర్బంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు. వారి శ్రేయస్సు కోసం ముందుకు వచ్చి కొట్లాడిన వ్యక్తి డా. బీఆర్ అంబేద్కర్ అని, అత్యంత శక్తివంతమైన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి, న్యాయ నిపుణుడిగా ప్రఖ్యాతి గాంచి, దేశ మూల స్థంభమైన ఆర్ధిక వ్యవస్థకు ఆర్ధిక నిపుణుడై, బహుముఖ ప్రజ్ఞశాలియై, పేరు గాంచిన గొప్ప సంఘ సంస్కర్త బాబా సాహెబ్ అని పేర్కొన్నారు.

నివాళులర్పించిన అనంతరం అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని నినాదాలు చేస్తూ..

కొండాపూర్ డివిజన్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్, సీనియర్ నాయకులు సిద్ధిక్ నగర్ బస్తీ అధ్యక్షులు కాలే బసవ రాజు, నందు, నరసింహ సాగర్, బుడుగు తిరుపతి రెడ్డి, గణపతి, చారీ, విక్రమ్, రవి శంకర్ నాయక్, విజయ్, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, తిరుపతి యాదవ్, డా. సుదర్శన్, పూజ, మణెమ్మ, కచ్చావా దీపక్, జుబెర్, అమీర్, దుర్గ ప్రసాద్, నయీమ్, దిలీప్, లక్ష్మి బాయి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here