స్వర్గీయ చేగూరి బాలకృష్ణ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అన్న సమారాధన

నమస్తే శేరిలింగంపల్లి: స్వర్గీయ చేగురి బాలకృష్ణ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మియాపూర్ క్రాస్ రోడ్ లోని శివాలయంలో అయ్యప్ప స్వామికి అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కిషోర్ యాదవ్ గురుస్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ చేగూరి మధుర వేణి, చైర్మన్ చేగురి సాయికుమార్ గౌడ్ లు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు.

అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్న అయ్యప్ప దీక్ష స్వాములు

పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప దీక్ష స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఆర్ కృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఆర్. ఓం ప్రకాష్ గౌడ్, హన్మంత రావు గౌడ్, టి. వెంకట్ రాజు గౌడ్, బి.వేణు గౌడ్, గురుస్వామి కే శంకర్, గురుస్వామి బి. ఈశ్వర్ ముదిరాజ్, కుమార్ గౌడ్, క్రాంతి శంకర్, లక్ష్మీకాంత్, సురేష్, సాయి యాదవ్, వెంకటేష్, భాను, ఎస్. రమేష్ వీరితో పాటు మియాపూర్, హఫీజ్ పేట్ సన్నిధానం స్వాములు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వాములు, స్థానిక ప్రముఖులతో అన్నదాన ప్రభువు, చేగూరి బాలకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ చేగూరి సాయికుమార్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here