నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ కాలనీలో జరుగుతున్న సిసి రోడ్డు పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. దాదాపు రూ. 30 లక్షలతో చేపట్టిన సిసిరోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను సుచించారు. సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీ వాసులు, టిఆర్ఎస్ నాయకులు సందింప్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు, పాల్గొన్నారు.