మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: సంఘసంస్కర్తగా, సామాజిక వేత్తగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి రచయిత మహాత్మ జ్యోతిరావు పూలే అని ఎంసిపిఐ యు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ కుంభం సుకన్య అన్నారు. తాండ్ర రాంచంద్రయ్య స్మారక భవనంలోని ఎంసిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో ముజఫర్ అహమ్మద్ నగర్ ఎంసీపిఐయు పార్టీ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి నిర్వహించారు. పల్లె మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు. సమాజంలో కులపరమైన వివక్ష అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధార పోసిన మహాత్ముడు.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే అని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంసిపిఐ యు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, కర్ర దానయ్య అంగడి పుష్ప, ఏ ఐ ఎఫ్ డి వై మహిళా విభాగం కన్వీనర్ ఎండీ సుల్తాన బేగం, ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ జిల్లా నాయకులు జి. శివాని, శ్రీలత, ఎండీ రజియా పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ కుంభం సుకన్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here