నమస్తే శేరిలింగంపల్లి : అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి ప్రభుత్వ వైద్యశాలలో పలువురు వైద్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వైద్య కేంద్రంలో వైద్యులను సత్కరించి పూల బోకే అందచేసి వైద్య వృత్తిలో వారు చేసిన సేవలను లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ నందికంది కరుణాకర్ గౌడ్ కొనియాడారు.
వైద్య రంగంలో సేవలు అందచేస్తున్న వైద్యులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ జోన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, లయన్స్ క్సబ్ ఆఫ్ శేరిలింగంపల్లి ఆద్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి, లక్ష్మీనారాయణగౌడ్, ట్రెజరర్ గండి చెర్ల జనర్దన్ రెడ్డి అశోక్ గౌడ్, స్వర్ణ లత తదితరులు పాల్గొన్నారు .