సబండ వర్గాల సంక్షేమ, ప్రజారంజక బడ్జెట్ : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

  • 2 లక్షల 91వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్
  • ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం

నమస్తే శేరిలింగంపల్లి : అసెంబ్లీ సమావేశంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్ధేశనతో రచించిన పూర్తి స్థాయి వార్షిక 2024-25 బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీరు చాలా అభినందనీయమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేశారని, ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమ, జన రంజక బడ్జెట్ అని, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని రూపొందించిన బడ్జెట్ ఇది అని, ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది అని, హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నామని తెలిపారు.


హైదరబాద్ నగర అభివృద్ధి కి 10 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు.

  • 2 లక్షల 91వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్
  • కేటాయించిన బడ్జెట్ ముఖ్యాంశాలు
  1. ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రభు త్వం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సలలో 1375 చికిత్స లకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతానికి పెంచారు.

అంతేకాదు ఇందులో 163 వ్యాధులను కొత్తగా చేర్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్ట నున్నట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలోనే ఈఎన్టీ ఆసుపత్రిని అందుబాటు లోకి తెస్తామన్నారు.

వైద్య ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్ లో రూ.11,468 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

2. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 1500 కోట్లు మూసీ నది నీటిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న తర్వా యూకే ప్రభుత్వం తో ఈ విషయమై చర్చలు జరిపారు.

హైద్రాబాద్ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులను యూకేకు తీసుకెళ్లి ప్రభు త్వం ఈ విషయమై చర్చించింది. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కు ప్రభుత్వం రూ 1500 కోట్లు కేటాయించింది.

3. హైద్రాబాద్ రింగ్ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,525 కోట్లు కేటాయి స్తు న్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పాతబస్తీలో మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూ. 50 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు.

4. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ. 3,065 కోట్లు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.3 ,065 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏలో కూడా మౌలిక వసతుల కోసం రూ.500 కోట్లను కేటాయిం చినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

5. మెట్రో వాటర్ వర్క్స్ కు రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ. 200 కోట్లను కేటాయించినట్టుగా భట్టి విక్రమార్క వివరించారు. హైద్రాబాద్ నగర అభివృ ద్దికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. విమా నాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు కేటాయించినట్టుగా ప్రభు త్వం వెల్లడించింది.

6. రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తు న్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.723 కోట్లను కేటాయించింది.

7. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 2,418 కోట్లను కేటాయించింది.

రూ.2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ రూ. 2లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. మూలధన వ్యయం రూ.33 వేల 487 కోట్లుగా ఉందని ప్రభుత్వం తెలిపింది.

రెవిన్యూ వ్యయం రూ .2,20,945 కోట్లుగా ఉందని భట్టి తెలిపారు.రాష్ట్ర అప్పు లు రూ.6.70 లక్షల కోట్లకు పెరిగాయని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అప్పు లు రూ.35,118 కోట్లని ఆయన వివరించారు. బీఆర్ఎస్ సర్కా్ర్ చేసిన అప్పులకు వడ్డీలతో కలిపి రూ. 42,892 కోట్లను చెల్లించామన్నారు.

  • తెలంగాణ బడ్జెట్:
  • తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు
  • తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..
  • ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..
  • వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..
  • వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659
  • హార్టికల్చర్-737
  • పశుసంవర్ధక శాఖ-19080
  • మహాలక్ష్మి ఉచిర రవాణా-723
  • గృహజ్యోతి-2418
  • ప్రజాపంపిణీ వ్యవస్థ-3836
  • పంచాయతీ రాజ్-29816
  • మహిళా శక్తి క్యాంటిన్ -50
  • హైదరాబాద్ అభివృద్ధి-10,000
  • జీహెఎంసీ-3000
  • హెచ్ ఎండీఏ-500
  • మెట్రో వాటర్-3385
  • హైడ్రా-20
  • ఏయిర్పోట్ కు మెట్రో-100
  • ఓఆర్ ఆర్ -200
  • హైదరాబాద్ మెట్రో-500
  • ఓల్డ్ సిటీ మెట్రో-500
  • మూసీ అభివృద్ధి-1500
  • రీజినల్ రింగ్ రోడ్డు-1500
  • స్ర్తీ ,శాశు -2736
  • ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17000
  • మైనారిటీ సంక్షేమం-3000
  • బీసీ సంక్షేమం-9200
  • వైద్య ఆరోగ్యం-11468
  • విద్యుత్-16410
  • అడవులు ,పర్యావరణం-1064
  • ఐటి-774
  • నీటి పారుదల -22301
  • విద్య-21292
  • హోంశాఖ-9564
  • ఆర్ అండ్ బి-5790
  • జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 3065 కోట్లు
  • హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 500 కోట్లు
  • మెట్రో వాటర్ వర్క్స్ 3385 కోట్లు
  • హైడ్రాకి 200 కోట్లు
  • ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు
  • ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు
  • హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 500 కోట్లు
  • పాత నగరంలో మెట్రో విస్తరణకు 500 కోట్లు
  • మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు 50 కోట్లు
  • మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు1500 కోట్లు
  • మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం పదివేల కోట్లు
  • బీసీ సంక్షేమం 9200 కోట్లు
  • మైనార్టీ శాఖకు 3003 కోట్లు
  • ఎస్సి సంక్షేమం 33124కోట్లు
  • ఎస్టీ 17056 కోట్లు
  • స్త్రీ శిశు సంక్షేమం 2736 కోట్లు
  • త్రిబుల్ ఆర్ కు 1525 కోట్లు
  • హైదరాబాద్ నగర అభివృద్ధి కి 10వేల కోట్లు..
    పౌరసరఫరాలకు, మహిళా సంక్షేమానికి, విభిన్న సంస్కృతమైన సమాజంలో అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తి దాకా ప్రగతి ఫలాలను అందించాలని సకల జనుల సంక్షేమం కోరుతూ ప్రజల కలలు పండించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రగతి పధంలో తీసుకెళ్లటానికి రూపొందించిన బడ్జెట్ అని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here