వేడుకగా శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

  • ప్రతిపక్ష పార్టీల నాయకుల దుశ్చర్యలను తిప్పికొడదాం: ప్రభుత్వ విప్ గాంధీ
  • శేరిలింగంపల్లి ప్రగతి నివేదన విడుదల
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని రాగం పిలుపు
శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : అభినందన్ బంకేట్ హాల్లో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆద్వర్యంలో వేడుకగా నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని, తప్పుడు కథనాలు సృష్టించే ప్రతిపక్ష పార్టీల నాయకుల దుశ్చర్యలను తిప్పికొట్టే బాధ్యత మనందరి పైన ఉందని కార్యకర్తలు, నాయకులకు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలోకి చేరేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్/ఏరియా కమిటీ సభ్యులు, బస్తి అధ్యక్షలు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ ప్రగతి నివేదికను ప్రభుత్వ విప్ గాంధీ ప్రవేశపెట్టారు.
శేరిలింగంపల్లి డివిజన్ ప్రగతి నివేదిక (వార్డు నంబర్ 106)
 డివిజన్ ఓటర్ల వివరాలు
 స్త్రీలు: 30492
 పురుషులు: 33945
 ఇతరులు: 25
 పోలింగ్ కేంద్రాల సంఖ్య: 64
 మొత్తం ఓటర్ల సంఖ్య: 64462
 అభివృద్ధి పనుల వివరాలు
315 కోట్ల 57 లక్షల 31 వేల 656 రూపాయల నిధులతో డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు.
 అభివృద్ధి పనుల వివరాలు
173 కోట్ల 45 లక్షల రూపాయల GHMC నిధులతో డివిజన్ లోని కాలనీ లలో, బస్తీలలో కల్పించబడిన మౌలిక వసతులు వివరాలు.
క్రమ సంఖ్య                       వర్గం                మొత్తం పనులు
సంఖ్య               అంచనా వ్యయం
1 బీటీ రోడ్డు                         53                    3225.00
2 సీసీ రోడ్డు                        236                    6149.00
3 యూజీడీ                          96                    2810.00
4 కమ్యూనిటీ హాల్/
వార్డు కార్యాలయం నిర్మాణాలు   14                    393.00
5 ఫుట్‌పాత్                            4                    280.00
6 మోడల్ లేక్స్                       7                    478.00
7 మల్టీ పర్పస్ హాల్స్                1                    175.00
8 డీసిల్టింగ్                           12                    206.00
9 కాంపౌండ్ వాల్                    19                    408.00
10 స్ట్రామ్ వాటర్ డ్రైన్
(వరద నీటి కాలువ)                 64                    1622.00
11 ఇతర పనులు (మ్యాన్ హోల్స్ ఫై కప్పులు మరియు
కాలువలు శుభ్రపరుచుట)         103                    1389.00
12 స్మశాన వాటికలు                    5                    210.00
మొత్తం                                 614                    17345.00
 విధి దీపాల నిర్వహణ:
 1 కోటి 49 లక్షల రూపాయల నిధులతో విధి దీపాల నిర్వహణ చేశారు.
 మిషన్ భగీరథ :
 కొత్తగా దాదాపు 2820 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
 డివిజన్ లో ఇప్పటి వరకు దాదాపు 8332 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
 డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 11 కోట్ల రూపాయలతో మంచినీటి వసతి కల్పించారు. (సెంట్రల్ పార్క్ , స్ప్రింగ్ వ్యాలీ , క్రాంతి వనం మొదలగు కాలనీలలో మంచినీటి లైన్లు అభివృద్ధి చేశారు.)
 డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 1 కోటి 62 లక్షల రూపాయలతో యూజీడీ వసతులు ఏర్పాటు చేశారు.
 రోజు విడిచి రోజు నలభై అయిదు నిమిషాల నుండి ఒక గంట వరకు నీటి సరఫరా జరుగుతున్నది.
 ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా ఇస్తున్నారు.


 రిజర్వాయర్ల నిర్మాణం :
 హడ్ కో ప్రాజెక్ట్ కింద 27 కోట్ల 34 లక్షల రూపాయలతో దాదాపు 36 కిలోమీటర్లు కొత్త పైపు లైన్లను వేశారు.
 సీఎంసీ లేఔట్ మస్జీద్ బండ శ్రీ రామ్ నగర్ కాలనీ లో 22 కోట్ల 20 లక్షల రూపాయలతో 3 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ను నిర్మించారు.
 డోఎన్స్ కాలనీ లో 11 కోట్ల 91 లక్షల రూపాయలతో 8 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ను నిర్మించారు.
 నాలాల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం:
 లింగంపల్లి రామాలయం వద్ద కల్వర్ట్ నిర్మాణం 2 కోట్ల రూపాయలతో నాలా పై కల్వర్ట్ నిర్మాణం చేపట్టారు.
 BHEL చౌరస్తా వద్ద గ్యాస్ గో డౌన్ నాలా పై కల్వర్ట్ నిర్మాణం 1 కోటి 70 లక్షల రూపాయలతో చేపట్టారు.
 సుందరీకరణ పనులను చేపట్టిన చెరువులు
 2 కోట్ల 39 లక్షల రూపాయలతో గోపి చెరువు అభివృద్ధి
 74 లక్షల రూపాయలతో చాకలి చెరువు అభివృద్ధి
 లింక్ రోడ్స్ :
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా ప్రత్యామ్న్యాయ రోడ్ల నిర్మాణం.
(46,42,00,000) 46 కోట్ల 42 లక్షల రూపాయలతో అభివృద్ధి:
 మస్జీద్ బాండ నుండి జేవీ హిల్స్ పార్క్ VIA ప్రభుపాద టౌన్షిప్ 8 కోట్ల 12 లక్షల రూపాయలతో అభివృద్ధి
 శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ నుండి NH -65 VIA మంజీర పైప్లైన్ రోడ్ 19 కోట్ల 85 లక్షల రూపాయలతో అభివృద్ధి
 బొటనికల్ గార్డెన్ రోడ్ నుండి హాఫీజ్పేట్ రైల్వే ట్రాక్ VIA జేవీ హిల్స్ 4 కోట్ల 45 లక్షల రూపాయలతో అభివృద్ధి
 మై హోమ్ మంగళ నుండి క్రాంతి వనం లేఔట్ వరకు 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి
 కంటి వెలుగు :
1. రెండవ విడత కంటి వెలుగు పధకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరుకు 5872 మంది కంటి పరీక్షలు జరిపి 1204 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణి చేయడం జరిగింది. వైద్యుల సూచనల మేరకు ఇంకా 770 మందికి కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉంది.
 కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం
 కళ్యాణ లక్ష్మీ – 602
 షాదీ ముబారక్ -260
మొత్తం 862 మంది లబ్దిదారులకు (8,15,41,656) 8 కోట్ల 15 లక్షల 41 వేల 656 రూపాయలు ) అందించడం జరిగింది.
 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF/LOC)
 లబ్ధిదారుల సంఖ్య – 283 (1, 94, 40,000) 1 కోటి 94 లక్షల 40 వేల రూపాయలు అందించడం జరిగింది.
 పింఛన్లు
 వృధ్యాప్య పింఛన్లు – 1169
 వితంతువు పింఛన్లు – 1854
 వికలాంగుల పింఛన్లు – 666
 ఒంటరి మహిళా పింఛన్లు – 227
 మొత్తం పింఛన్లు – 3916
 దళిత బంధు :
 దళిత బంధు పధకం ధ్వారా దళిత కుటుంబాలకి ఉపాధి అవకాశాల
కొరకు ఒకొక్కరికి 10 లక్షల చొప్పున పది మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేయడమైనది .
 CDP ఫండ్స్ :
CDP ఫండ్స్ కింద 1 కోటి 8 లక్షల 20 వేల రూపాయల నిధుల
ద్వారా చేపట్టిన పనులు.
 ఆరంభ టౌన్షిప్ వద్ద బోర్ వెల్ కొరకు 2 లక్షల 50 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 తారా నగర్ బాలాజీ టెంపుల్ వద్ద పవర్ బోర్ వెల్ కొరకు 3 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 రాంప్రసాద్ దుబయ్ కాలనీ లో తాగు నీరు అందించడానికి 3 లక్షల రూపాయల నిధులను మంజూరి చేశారు.
 100 mm DIA DI వాటర్ సప్లై తారానగర్ కొరకు 5 లక్షల 30 వేల రూపాయల నిధులను మంజూరి చేశారు.
 150 MM DIA వాటర్ సప్లై హుడా ట్రేడ్ సెంటర్ కొరకు 5 లక్షల 40 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 150 /100 MM DIA వాటర్ సప్లై పైప్లైన్ , రామయ్య నగర్ కాలనీ 14 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 తారా నగర్ వద్ద కమ్యూనిటీ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు..
 తారా నగర్ వద్ద మహిళా భవన్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 APHB కాలనీ MIG IV ఫేస్ వద్ద మహిళా భవన్ నిర్మాణానికి 30 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 రాజీవ్ గృహ కల్ప వద్ద యూత్ బిల్డింగ్ నిర్మాణంకొరకు 10 లక్షల రూపాయల మంజూరు చేశారు.
 గోపి నగర్ వద్ద కమ్యూనిటీ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 DMF ఫండ్స్ :
 డోయెన్స్ కాలనీ వద్ద కమ్యూనిటీ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 SDF ఫండ్స్ :
1. SDF ఫండ్స్ ద్వారా 50 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను పంపించడమైనది.
 పార్కుల అభివృద్ధి :
 పార్కులు – 02
 సాయి పృథ్వి ఎనక్లేవ్ వద్ద 8 లక్షల 74 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు..
 జేవీ హిల్స్ వద్ద 8 లక్షల 56 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు..
 అలిండ్ ఎంప్లాయిస్ హోసింగ్ సొసైటీ పార్క్ లో 18 లక్షల రూపాయల తో ఓపెన్ జిం ఏర్పాటు చేయడమైనది.
 రాజీవ్ స్వగృహ వద్ద పార్క్ లో 18 లక్షల రూపాయల తో ఓపెన్ జిం ఏర్పాటు చేయడమైనది.
 బస్తి దవాఖాన:
 శేరిలింగంపల్లి డివిజన్ పరిధి లోని గోపి నగర్ , పాపిరెడ్డి నగర్ లో బస్తి దవాఖాన ఏర్పాటు చేయంచి పేదలకు ప్రతి రోజు 160 మందికి పైగా బీపీ, షుగర్ మరియు ఇతర రక్త పరీక్షలు లాంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
 శేరిలింగంపల్లి డివిజన్ లో గల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో పేదలకు ప్రతి రోజు 200 మందికి పైగా వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
 గర్భిణీ స్త్రీలకు 9 నెలలు నిండే వరుకు వారికి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారు.
 చంటి పిల్లలకు ప్రతి బుధవారం మరియు శనివారం ఉచితంగా టీకాలు వేస్తున్నారు.
 చేపట్టవలసిన పనులు
 లింగంపల్లి 6TH ప్లాట్ ఫామ్ వద్ద కల్వర్ట్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here