- ఖాజాగూడ లో పెద్దకుంట చెరువు సుందరీకరణ పనులను ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన మంత్రి

నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి ఖాజాగూడ లో పెద్దకుంట చెరువు సుందరీకరణ పనులను ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యీ పట్నం మహేందర్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీఎస్ డబ్ల్యూ సీడీసీ చైర్ పర్సన్ ఆకుల లలిత, ప్రాజెక్ట్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఐఎఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్, బోరబండ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్‌ఎండీఏ పరిధిలోని 25 – మొత్తం 50 చెరువులను అభివృద్ధి లక్ష్యంగా ”చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని” మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. వాకింగ్ ట్రాక్, ల్యాండ్ స్కేప్, ఓపెన్ జిమ్స్, బెంచెస్, టాయిలెట్స్, సాయంత్రం నడక కోసం విధి దీపాలు ఏర్పాటు, పిల్లల కొరకు ఆట స్థలం, చెరువు చుట్టుపక్కల ప్రాంతం యొక్క బహిరంగ వీక్షణను అందించే పైకప్పు నిర్మాణం, యాంఫీ థియేటర్ వంటి సకల వసతులు ఏర్పాటు చేసి చెరువులను సుందర శోభిత వనంలు గా తీర్చిద్దిద్దుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చెరువుల సుందరీకరణకు మహర్దశ వచ్చినదని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.