- బంగారు పథకం అందుకోవడం వరుసగా ఇది మూడోసారి
- అభినందనలు తెలిపిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ స్టేట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ లో ఈ నెల 24, 25న తెలంగాణ ఎలైట్ మేన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి బాక్సర్లు వివిధ కేటగిరీలలో నిర్వహించిన పోటీలో 150 మంది పాల్గొనగా 13 మంది విజేతలుగా నిలిచారు. ఇందులో గెలుపొందిన వారు హరియణలోని హిసార్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలో పాల్గొంటారని కోచ్ బాగరి నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా హెవీ వెయిట్ కేటగిరీలలో మియపూర్ చెందిన కాకుళ్లవరుపు అనూప్ నాయుడు బంగారపు పథకాన్ని సాధించారు. ఇది వరుసగా మూడోసారి గెలవడం పై కుటుంబ సభ్యులు, పలువురు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.






