- మోడీకి ఓటేస్తే మరోసారి దేశ ప్రజలను మోసం చేయడమే
- బొటనికల్ గార్డెన్ పార్కులో చేసిన మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చిందంటే పక్కా అమలు చేస్తుందని, మోడీ గ్యారెంటీ అంటే మరొకసారి ప్రజలను మోసం చేయడమేనని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఆదివారం ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలోని బొటనికల్ గార్డెన్ వద్ద మార్నింగ్ వాక్ చేసి సందర్శకులతో ముచ్చటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతును కోరుతూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా డాక్టర్.జి.రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసిన ఘనత తమదన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉంటే రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ ఉందని, కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకులు, యువజన, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సెల్ తదితర విభాగాల నాయకులు హాజరయ్యారు.