నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మదీనాగూడ, గోపి నగర్, బాపూనగర్ కాలనీలలో శ్రావణ మాస బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల సంబురాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఆ అమ్మవార్ల అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
కార్యక్రమంలో ఎల్లేష్, చంద్రమౌళి, గుణశేఖర్, రమేష్, శివ, సాయి, సుధాకర్, హరి శంకర్ పాల్గొన్నారు.