- అంజయ్య నగర్, సిద్ధిఖ్ నగర్లలో పర్యటన
నమస్తే శేరిలింగంపల్లి : అంజయ్య నగర్, సిద్ధిఖ్ నగర్లలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులుతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆయా బస్తీలలో పర్యటించి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, తాగునీటిలో కలుషిత నీటి సరఫరా, పాడైన రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పారిశుద్ధ్యం, అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మించడం వంటి సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలుషిత నీరు తాగి అనేకమంది విష జ్వరాలతో బాధపడుతున్నారని తెలుపుతూ స్థానిక జోనల్ కమిషనర్ ని, వాటర్ వర్క్స్, సివరేజ్ బోర్డు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ తరపున బాధ్యత తీసుకుంటామని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రవి నాయక్, సంతోష్, సరోజా రెడ్డి, ఆత్మరావ్, బనిసిలాల్, కిషన్ జి, అరవింద్, యాదగిరి పాల్గొన్నారు.