- ప్రత్యేక పూజలు చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆదర్శ్ నగర్ కాలనీలో శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ భవాని అమ్మవారి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలువాతో సత్కరించి విజయ దుర్గ భవాని అమ్మవారి చిత్రపటం బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ అశోక్, వైస్ ప్రెసిడెంట్ సత్తి కుమార్, జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్, మురుగేష్, హరినాథ్, మహేష్ శ్రీనివాస్, ప్రణీష్, కర్ణ, గుణ శేఖర్, గోపాల్, ధర్మరాజు, మంజునాథ్, ధర్మరాజు, వేలు, శ్రీనివాస్ మరియు పద్మారావు, హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజు, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహేష్ చారీ, సుభాష్ రాథోడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.