- న్యాయం చేయాలంటూ వచ్చిన బాధితుడి నుంచి లంచం డిమాండ్
- రైటర్ విక్రమ్ కు చెల్లిస్తుండగా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు
నమస్తే శేరిలింగంపల్లి : లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. వివరాలు.. మాదాపూర్ పోలీసు స్టేషన్ లో సెక్టార్ ఎస్ఐగా రంజిత్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవలే ఆ ఎస్సై వద్దకు ఓ బాధితుడు తనకు న్యాయం చేయాలంటూ వచ్చాడు. ఇందుకు అతడి వద్ద లంచం ఆశించాడు.
కొంత మొత్తంలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని ఎస్సై చెప్పడంతో కొంత చెల్లించాడు. మిగతాది శనివారం ఎస్ఐ రంజిత్ సూచనల మేరకు రైటర్ విక్రమ్ కు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ లో ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు ఏసీబీ డీస్పీ ఆనంద్ తెలిపారు.