నమస్తే శేరిలింగంపల్లి: నరేంద్ర మోడీ స్పూర్తితో , భిక్షపతి యాదవ్ అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి చేసి చూపిస్తామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తెలిపారు. గడపగడపకు బీజేపీ రవన్న ప్రజా యాత్ర కార్యక్రమంలో భాగంగా లింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బి బ్లాక్ నందు ఇంటి ఇంటికీ తిరుగుతూ,కరపత్రాలను పంచారు. బి ఆర్.ఎస్ పార్టీ అవినీతి అక్రమాలను తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ కాలనీ లో రోడ్లు, డ్రైనేజీ లైన్లు, మంజీర వాటర్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసింది భిక్షపతి యాదవ్ మాత్రమేనని తెలిపారు.
ప్రస్తుత బి.ఆర్.ఎస్ నాయకులు నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమి లేదని, గప్పాలు కొట్టుకోవడం తప్ప అని ఎద్దేవా చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో కాషాయం జెండా ఎగరవేస్తామని , గెలిచిన తరువాత నరేంద్ర మోడీ స్పూర్తితో, భిక్షపతి యాదవ్ అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్ , చంద్ర శేఖర్ యాదవ్, రమేష్, శ్రీశైలం , అనంత రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకటేష్, లక్ష్మయ్య , ఆంజనేయులు, రాజు , శంకర్, పద్మ, విజయలక్ష్మి, అరుణ , సుశీల, నాగులు, పార్వతి, ఆదిలక్ష్మి, రాజేష్, వినయ్, ఆకుల లక్ష్మణ్, నరసయ్య, గణేష్ ముదిరాజ్, శివరాజ్, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.