- ఎస్ ఎల్ జీ ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో ఎస్ ఎల్ జీ ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలతో కూడిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇక్కడి పరిసర ప్రాంత పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ శిబిరం ఏర్పాటు చేసిన ఎస్ ఎల్ జీ ఆసుపత్రి యాజమాన్యం కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్, గైనకలజీ, ఆర్థో, తదితర పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కళ్ళజోడులు, మందులు పంపిణీ చేశారు. మానవతా దృక్పథంతో ఉచితంగా మందులు పంపిణి చేసి పేదల వద్దకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు మాట్లాడుతూ ఈ శిబిరంలో ముఖ్యంగా జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, డెంటల్, కంటివైద్య పరీక్షలు కూడా చేశామని. ఎక్కువమందికి రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, 2డి ఎకో తదితర పరీక్షలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్ష మందికి ఏడాదికాలంలో ఉచితంగా ఈసీజీ పరీక్షలు చేసి, ఈ పరిసరాలను గుండెవ్యాధుల రహితంగా చేయాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగం నుంచి డాక్టర్ సబీల, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అజయ్, మరియు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.