- సీఎంఆర్ ఎఫ్ ఎల్ ఓసి పత్రాన్ని అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ కి చెందిన రవి కుమార్ పర్వత నేనికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ ఎఫ్ నుంచి రూ. 2లక్షలు మంజురయ్యాయి.
ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ ఎల్ ఓసి పత్రాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి భరోసా నిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్ పాల్గొన్నారు.