కమలం గెలుపునకు కృషి చేద్దాం : కొండ విశ్వేశ్వర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డపై కమలం పువ్వు జెండా ఎగిరే విధంగా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు.

అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు పోయి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం మసీద్ బండ కొండాపూర్ లో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి , నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, కన్వీనర్ రాఘవేందర్ రావు, కార్యవర్గ సభ్యులు రవీందర్రావు , సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగులు గౌడ్ ,రామరాజు , నవతారెడ్డి , బుచ్చిరెడ్డి, విజయలక్ష్మి, మరియు కుటుంబ,నియోజవర్గ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు అతి దగ్గరలోనే ఉన్నాయనీ, భారతీయ జనతా పార్టీ తరపున తాను బరిలో ఉన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా బూత్ లెవెల్ నుండి కష్టపడి పనిచేసినట్లయితే తప్పకుండా విజయం సాధించొచ్చునని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి

రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గం లో మొన్న జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కొన్ని వివిధ కారణాలవల్ల ఓటమిపాలైందని తెలుపుతూ జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బూత్ స్థాయి నుండి హార్డ్ వర్క్ చేస్తూ సీనియర్ లీడర్ నుండి సామాన్య కార్యకర్త వరకు ఒకరు ఒక బూతుకు ఇన్చార్జిగా వ్యవహరించి మంచి మెజార్టీ తీసుకొచ్చినట్లయితే అభ్యర్థి గెలుపుకు మంచి ఫలితాలు లభిస్తాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర , జిల్లా, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెంట్ కార్పొరేటర్స్, మహిళా మోర్చా, యువ మోర్చా, ఎస్టీ మోర్చా, దళిత మోర్చా, బీజేవైఎం నాయకులు, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here