ప్రజావసరాలు ప్రభుత్వం తీర్చలేకపోతున్నది

  • జీహెచ్ ఎంసీ కౌన్సిల్ హాల్ లో బల్దియా సమావేశంలో ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ ఎంసీ కౌన్సిల్ హాల్ లో బల్దియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చర్చించారు.

జీహెచ్ ఎంసీ కౌన్సిల్ హాల్ లో బల్దియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజలకు కనీస అవసరాలు కల్పించలేకపోతుందని, కాలయాపన చేస్తూ, అభివృద్ధిని విస్మరిస్తుందనిన్నారు. గత 3 నెలల నుండి కాలనీలలో సరిగ్గా వీధి దీపాలు లేవని, పారిశుధ్యం, జీహెచ్ ఎంసీ రోడ్డు ,డ్రైనేజీ, వంటి పనులు చేయకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేశారని , గొప్పగా ఐ ఏ ఎస్ అధికారులను జోనల్ కమిషనర్లు గా నియమించడం జరిగినదని, ఎంతో సంతోషించామని, చక్కటి పాలన అందుతుందని సంతోషించామని , కానీ వారికి ఒక్క రూపాయి పని లేని వ్యవస్థను అప్పజెప్పారని తెలిపారు. వారికి నిధులు మంజూరు చేయకుండా చేస్తున్నారని ,గతంలో గత బీఆర్ఎస్ ప్రభుతం హయాంలో నిర్వహణకు నెలకు 8కోట్ల నిధులు మంజూరయ్యేవని, ఇప్పడు 4 కోట్లు విడుదల చేయకుండా వ్యవస్థ సచ్చిందా , బతికిందా అనే చందంగా మారిందన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో GHMC అని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి అవుతుందని ప్రజలు పట్టం కడితే ,అభివృద్ధి ని విస్మరించి , గత పాలకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here