యువత చూపు.. బిజెపి వైపే

  • బిజెపిలోకి కొనసాగుతున్న వలసల పర్వం
  • బిజెపిలోకి భారీగా చేరిన కొండాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ల యువకులు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
కొండాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ల యువకులు పార్టీలో చేరిన సందర్బంగా మాట్లాడుతున్న రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ల నుంచి దాదాపు 300 మంది యువకులు.. ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్ రమేష్, చంద్రశేఖర్ యాదవ్, జీవన్, శ్యామ్, సునీల్ గుప్తా, నరసింహా ఆధ్వర్యంలో రవి కుమార్ యాదవ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. నరేంద్ర మోడీ పరిపాలన తీరు, భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లుగా వారు ప్రకటించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో రోజు రోజుకి బిజెపి పార్టీకి ఆదరణ పెరుగుతుందని, ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వేలాది మంది పార్టీలో చేరుతూ బిజెపికి మద్దతు తెలియజేస్తున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఏండ్లు గడుస్తున్నా యువతను పట్టించుకోకపోవడం దారుణమని, రేపు కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగడానికి యువత పెద్దఎత్తున నడుం బిగించాలని యువతకు పిలుపునిచ్చారు. నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల అవసరాలను పక్కనపెట్టి తమ ఎదుగుదలనే ఎజెండాగా పెట్టుకొని చెరువులను, పార్కులను, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని.. రానున్న రోజుల్లో బిజెపి ఆధ్వర్యంలో చెరువుల ఆక్రమణపై పెద్ద ఎత్తున ఉద్యమించి కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీల కలిసిన వారు సంతోష్, రాఖి డానియల్, కిరణ్, చిన్న, నితీష్, పండు, ఆకాష్, తేజ, రాము, మొదలగువారు పార్టీలో చేరారు.

బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ను గజమాలతో సన్మానిస్తున్న పార్టీలో చేరిన యువకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here