అన్ని వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కృషి : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • 16వ రోజు ఖాజాగుడా విలేజ్, వీకర్ సెక్షన్ కాలనీ, వడ్డెర బస్తిలలో కొనసాగిన రవన్న ప్రజాయాత్ర

 

బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్రలో భాగంగా ఖాజాగూడా విలేజ్, వీకర్ సెక్షన్ కాలనీ, వడ్డెర బస్తిలలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఆర్ ఎస్ ప్రభుత్వం పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు , డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టూ పిజి ఉచిత విద్య, ఇలా అనేక హామీలు ఇచ్చి అమలుచేయడంలో విఫలమైందన్నారు. పదవ తరగతి నుండి గ్రూప్ 1 పరీక్షల వరకు ప్రతి ఒక్కటి లీకేజీనేనని, విద్యార్థులు , నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వీళ్లకు ఇంటికి పంపించి సరైన బుద్ది చెప్పాలన్నారు. ఈ డివిజన్ లో గంగాధర్ రెడ్డి గారు ఎన్నికైన 2 సంవత్సరాలలో డివిజన్ లోని కాలనీలలో, బస్తీలలో అనేక సమస్యలు పరిష్కరించడం సంతోషకరంగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అరుణ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, రవి, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, అశోక్, మల్లేష్, రాము జే, శ్రీను, స్థానిక వాసులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here