మీరే నా బలం ..మీరే నా నమ్మకం

  • ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా, డబుల్ ఇంజిన్ సర్కారే మన లక్ష్యం : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
  • మియాపూర్ డివిజన్, న్యూ కాలనీ నుంచి బీజేపీలో చేరిన యువకులు, స్థానిక కాలనీ వాసులు
  • రోజు రోజుకు భారతీయ జనతా పార్టీపై పెరుగుతున్న జనాదరణ
పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచిన ఘనత సీఎం కేసిఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్, న్యూ కాలనీ నుంచి పవన్ యాదవ్ ఆధ్వర్యంలో చిన్నా గౌడ్, లక్ష్మణ్, బాబు గౌడ్, శంకర్, బాలకృష్ణ, ప్రీతం గౌడ్, వినయ్, అశోక్, నాగబాబు, చిటుకుల పవన్, వారి సన్నిహితులు, స్థానిక కాలనీ వాసులు, భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలో సాదరంగా ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మోడ్రన్ స్కూల్స్, కేజీ టూ పి.జి ఉచిత విద్య, దళితులకు 3 ఎకరాల భూమి, బి.సి లకు 33% రిజర్వేషన్లు , 25 వేల కోట్లు, ఎస్టి లకు ట్రైబల్ యూనివర్సిటీ , గిరిజన బంధు, టెక్స్టైల్ జోన్ , ఈ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి బస్తి, ప్రతి కాలనీ అభివృద్ధి చేసింది పి.జే.ఆర్, భిక్షపతి యాదవ్ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, ఆకుల లక్ష్మణ్, శ్రీశైలం, మహేష్, విజయేందర్, భరత్, మంజుల, పాపయ్య, సురేష్ , రవి గౌడ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్, చందు, అశోక్, రాము, జె.శ్రీను, బీజేపీ నాయకులు కార్యకర్తలు, స్థానిక వాసులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన వారితో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here