మా నౌకరీలు మాగ్గావాలి..నిరుద్యోగులతో దద్దరిల్లిన ధర్నా చౌక్

  • మహాధర్నా కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన బిజెపి పార్టీ శ్రేణులు
  • నిరుద్యోగులకు అండగా నిలుస్తాం: రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ 
మహాధర్నా కార్యక్రమానికి బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్తున్న బీజేపీ రాష్ట్రనాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: నిరుద్యోగులతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదాలు హోరెత్తాయి.. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ సిట్టింగ్ జడ్జితో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో విచారణ జరిపించాలని డిమాండ్ వెల్లువెత్తాయి. ఇదంతా తెలంగాణ బిజెపి పార్టీ రథసారథి బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ మహా ధర్నాలో చోటు చేసుకున్నది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బయలుదేరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ గత ఆరు నెలల నుండి విద్యార్థులు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని రేయనక పగలనక కష్టపడుతూ చదువుతున్నారు ఈ పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల ఆశలు అడియాశలు అయిపోయాయని వారు కన్నా కలలు వృధా అయిపోయాయని రోడ్లమీద నిరుత్సాహంగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్ పీఎస్ అధికారుల ఆధీనంలో ఉన్న వార్ రూమ్ తాళం చెవులు ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఎలా వెళ్లాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ తప్పిదం వల్ల ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసుకుంటూ కన్నవారి కడుపుకోత మిగిల్చిందని తక్షణమే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, ఆంజనేయులు సాగర్, అనిల్ కుమార్ యాదవ్, నర్సింగ్ రావు, రమేష్, శ్రీశైలం కురుమ, సీతారామరాజు, లక్ష్మణ్ ముదిరాజ్, గోపాల్ రావు, బాలు యాదవ్, మధు యాదవ్, నరసింహ, వీరు యాదవ్, కృష్ణ నరేష్, గణేష్ ముదిరాజ్, సాయి, శ్రీనివాస, రాము సందీప్ గౌడ్ ఇందిరా, వరలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here