ప్రజలకు, కార్యకర్తలకు అండగా నేనున్నా

  • ప్రజలను ఇబ్బంది పెట్టినా.. మా కార్యకర్తల జోలికి వచ్చిన ఊరుకునేది లేదు
  • బి.ఆర్.ఎస్ నాయకులను హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
బి.ఆర్.ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న రవికుమార్ యాదవ్
పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ బి.కే ఎంక్లెవ్ నుంచి శివారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాలనీ వాసులు, యువత 100 కి పైగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ అతి , గతి లేని తెలంగాణ రాష్ట్ర సర్కారు పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని, అధికార పార్టీ నాయకులు అభివృద్ధిని మరిచి ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్మడంలో కేరాఫ్ అడ్రస్ గా మారారని దుయ్యబట్టారు. బి.కే ఎంక్లెవ్ లో బిక్షపతి యాదవ్ హయాంలో జరిగిన అభివృద్దే తప్ప ..ఎమ్మెల్యే గాంధీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టినా , తమ కార్యకర్తల జోలికి వచ్చిన ఊరుకునేది లేదని, మీ జాతకాలు అన్ని నాకు తెలుసని , తమ జోలికి వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నామని బి.ఆర్. ఎస్ నాయకులను హెచ్చరించారు. మీకు ఏ కష్టం వచ్చినా , సమస్యలున్న మీకు అండగా నేనున్నా ,భారతీయ జనతా పార్టీ ఉందని పార్టీలో చేరిన వారికి, కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో శివారెడ్డి, గోపాల్ రెడ్డి, షభాన్, విష్ణు వర్ధన్, శ్రీనివాసులు, సంపత్, గంగాధర్ రెడ్డి, సాంబ శివరావు, ఆధి రెడ్డి, సచిన్ వారి మిత్రులు, కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కసిరెడ్డీ భాస్కర్ రెడ్డి, రామకృష్ణ , గణేష్, వినోద్ యాదవ్, బాబు రెడ్డి, శ్రీను.జే, రాము.జే, బాబు, శ్రీనివాస్ , శ్రీకాంత్ యాదవ్, స్థానిక కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here