బిజెపిపై నమ్మకంతోనే చేరికలు: రవికుమార్ యాదవ్

  • మియాపూర్ డివిజన్ ప్రవీణ్, మన్యం, గౌతం, రవికాంత్ ఆధ్వర్యంలో ..బిజెపిలో చేరికలు
  • కాంగ్రెస్, బిఆర్ ఎస్ లపై విసుగుచెంది భారతీయ జనతా పార్టీ లో చేరుతున్నారు
  • పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేయండి.. అండగా మేమున్నాం:  బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలో కేసిఆర్ పరిపాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని, కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ప్రజలకు అర్థమైందని, బిజెపికి మద్దతు తెలుపుతున్నారని ఆ పార్టీ అభ్యర్థి రవి కుమార్ యాదవ్ అన్నారు.

పార్టీలో చేరిన వారితో… ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్

అంతేకాక ఆయా పార్టీల నుంచి బిజెపి లో చేరుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మియాపూర్ డివిజన్, ఎం. ఏ నగర్, ప్రవీణ్, మన్యం, గౌతం, రవికాంత్ ఆధ్వర్యంలో .. కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్, సిద్ధిక్ నగర్ యువకులు, కాలనీ వాసులు కొండాపూర్ బి.జే వై.ఎం అధ్యక్షులు నవీన్ రెడ్డి, బల్లుయాదవ్, ధర్మ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారీ సంఖ్యలో  బిజెపి పార్టీలో చేరారు.

మియాపూర్ డివిజన్ ప్రవీణ్, మన్యం, గౌతం, రవికాంత్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువకులు

అనంతరం వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు రవికుమార్ యాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ…రోజురోజుకీ భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుందని అన్ని కాలనీలు, బస్తీల నుండి అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మీరంతా పార్టీ పటిష్టత కోసం కృషి చెయ్యాలని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో అనిల్ రెడ్డి, గోపి కృష్ణ , పందరి, సరసమ్మ, లక్ష్మి, పవన్, గోవింద్, భాస్కర్, శ్రీను, వాసు వారి సన్నిహితులు, రాజు యాదవ్, రాజు, మూర్తి , ఆకాష్, గణేష్ ముకేష్, వారి సన్నిహితులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here