నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లి లోని ఎన్టీఆర్ నగర్ లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గోపన్ పల్లి , ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామన్నారు. రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సత్యనారాయణ , అనిల్, విజయ్ భాస్కర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, నరేష్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజుముదిరాజ్, జగదీశ్ , ఆకుల యాదగిరి, సీనియర్ నాయకులు, రమేష్ గౌడ్, నారాయణ, గోవింద్, అనిల్ సింగ్, శామ్లెట్ శ్రీనివాస్, జగదీశ్, దేవరకొండ అనిల్, చంద్ర శేఖర్, పరమేష్ , సలావుద్దీన్, అజ్ మత్, జకీర్, తహర్, బురాన్, ఖాదర్ ఖాన్, మహేష్ యాదవ్, మక్ బూల్, రవీందర్, సుధాకర్, శామ్లెట్ శ్రీకాంత్, శామ్లెట్ యువరాజ, శామ్లెట్, త్రినాథ్, శామ్లెట్ సాయి కుమార్, శామ్లెట్ సాయి కృష్ణ కే వై బాబు అజయ్ గౌడ్, దయాకర్, అర్జున్, అరుణ, కల్పన, బాలమణి, నీరజ, సుగుణ, మాధవి, కుమారి, రేణుక, రాజేశ్వరి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.