నమస్తే శేరిలింగంపల్లి: భారతీయపార్టీ గౌడ సామజిక వర్గ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీజేపీ గౌడ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌడ్ కులస్తులకు పిలుపునిచ్చారు.ఈ నెల 28 వ తేదీ శనివారం నాడు నగరం లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వేదికగా సమ్మేళనం జరుగుతుందని తెలిపారు.
ఉ. 10 గం. నుండి 12 గం. వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గౌడ సంఘం నేతలు, అతిథుల ప్రసంగాలు తదితర కార్యక్రమాలు జరుగుతాయని అయన తెలిపారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా గౌడ బంధువు కేంద్ర మంత్రి శ్రీపాద యెసో నాయక్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, మాజీ హోమ్ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్, మాజీ శాసన మండలి చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్ లు హాజరు కానున్నారని, గౌడ సోదరులంతా ఈ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.