- మద్దతు తెలిపిన కాంగ్రెస్, బిజెపి నాయకులు
గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో గల ఓక్రిడ్జ్ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యం ఆన్లైన్ తరగతులు నిలిపి వేయడంతో హైదరాబాద్ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులకు స్థానిక బీజేపీ నాయకులు మూల అనిల్ గౌడ్, గచ్చిబౌలి కాంగ్రెస్ నాయకులు అరకల భరత్ కుమార్ లు మద్దతు తెలిపారు.
ఆందోళనపై స్పందించిన యాజమాన్యం సాంకేతిక కారణాల వాళ్ళ ఆన్లైన్ తరగతులు ఆగిపోయాయని, ఫీజులు చెల్లించని వారి తరగతులను తాము ఆపలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు నాయకులు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ లోపు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించేలా చర్యలు చేపడతామని, ఆన్లైన్ తరగతులను తక్షణమే పునరుద్ధరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.