నమస్తే శేరిలింగంపల్లి : బిల్డింగ్ నిర్మాణ పనుల్లో పని చేస్తున్న వ్యక్తి ఆ భవనం నుంచి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నలగండ్లలో రంజై వైభవ్ సంస్థ భవన నిర్మాణ పనులు చేపడుతున్నది.
ఈ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న భవనంలో రమేష్ సింగ్ (40) పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి అక్కడికక్కడే చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. రమేష్ ఎలా చనిపోయాడు. నిర్మాణ సంస్థకు అనుమతులు ఉన్నాయా లేదా అన్న కోణంలో చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.