నమస్తే శేరిలింగంపల్లి : ఓ ఇంట్లో అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను గోంతుకోసి హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీ కాలనీలో తులసి (45 ) భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. స్థానికంగా కరీ పాయింట్ కొనసాగిస్తున్నది చాలాకాలంగా వీరిమధ్య జరుగుతున్న గొడవలే కారణం.
గతంలో తులసిపై అనుమానంతో ఆమె భర్త జగన్నాథం తరచూ గొడవ పడేవాడు. పలుమార్లు ఇరువురికి పెద్దలు నచ్చచెప్పినా వీరి మధ్య సయోధ్య కుదరలేదు. తాజాగా బుధవారం రాత్రి తన భర్త ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె గొంతుకోసి పారిపోయాడు. బాధితురాలి అరుపులతో అక్కడికి చేరుకున్న స్థానికులు తీవ్రరక్త స్రావంతో ఉన్న బాధితురాలిని నలగండ్ల లోని సిటిజెన్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స కొనసాగుతుంది. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.