- చేవెళ్ల ఎం.పి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుపై హర్షం
- అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు శేరిలింగంపల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి 75000 మెజారిటీ ఇచ్చి చేవెళ్ల ఎం.పి విశ్వేశ్వర్ రెడ్డి ని గెలిపించినందుకు శేరిలింగంపల్లి ప్రజలకు బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. గత 6 నెలలుగా నిధులు లేకున్నా వందకు పైగా శిలాపలకాలు పెట్టి, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన ప్రజాప్రనిధులు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఒక పార్టీ గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీ లో చేరి పదవులు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీలో చేరి తమ వ్యాపారాలను కాపాడుకునే నాయకులకు శేరిలింగంపల్లి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే 75 వేల పైగా బీజేపీ పార్టీకి మెజారిటీ ఇచ్చిన శేరిలింగంపల్లి ప్రజలకు మరోకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకనైనా శిలాఫలకాలు పెట్టిన కాలనీలలో వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేకుంటే ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు.